Teacher Posts at Gurukul Schools : గురుకుల విద్యాల‌యాల్లో ఈ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. అర్హులు వీరే!

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, గెస్ట్‌ టీచర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్‌ డి.జయ తెలిపారు. ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఫిజిక్స్‌–1, మ్యాధ్స్‌–2, ఇంగ్లీషు–1, హిందీ–1, సివిక్స్‌–1 మరియు ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు పీఈటీ–5, జీఎన్‌ఎం నర్సు–1(పురుషులు)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.

Free Hostel : సివిల్స్ అభ్య‌ర్థుల‌కు ఉచిత హాస్ట‌ల్ వ‌స‌తి..!

సంబంధిత సబ్జెక్టులు బోధించేందుకు పీజీలో 55 శాతం మార్కులు, బీఈడీ, టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి అని స్పష్టం చేశారు. డిగ్రీ, పీజీలు ఇంగ్లిష్‌ మీడియంలో చదివిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. బాలికల విద్యాలయం, కళాశాలలో బోధించేందుకు మహిళా అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 29వ తేదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారు ఈనెల 31న చీమకుర్తిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల, కళాశాలలో డెమోకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు.

AI Program at VVIT College : వీవీఐటీ క‌ళాశాల‌లో గూగుల్‌ క్లౌడ్‌ జెన్‌ ఏఐ ప్రోగ్రామ్‌.. విద్యార్థులు ఈ విష‌యాల్లో అవ‌గాహ‌న‌..

#Tags