Posts at University of Hyderabad : యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌/డిప్యూటేషన్‌ ప్రాతిపదికన నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 52.
»    పోస్టుల వివరాలు: గ్రూప్‌ ఎ పోస్టులు–09, గ్రూప్‌ బి పోస్టులు–10, గ్రూప్‌ సి పోస్టులు–33.
»    గ్రూప్‌–ఎ పోస్టులు: డిప్యూటీ రిజిస్ట్రార్‌–02, ఇంటర్నల్‌ ఆడిట్‌ ఆఫీసర్‌–01, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌–01, సీనియర్‌ సిస్టమ్‌ అనలిస్ట్‌–01, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌–01,అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌–02, నెట్‌వర్కింగ్‌ ఇంజనీర్‌–01.
»    గ్రూప్‌–బి పోస్టులు: సెక్షన్‌ ఆఫీసర్‌–03, అసిస్టెంట్‌ ఇంజనీర్‌–01, సీనియర్‌ అసిస్టెంట్‌–03, అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌–01, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌–01, పర్సనల్‌ అసిస్టెంట్‌–01.
»    గ్రూప్‌–సి పోస్టులు: టెక్నికల్‌ అసిస్టెంట్‌–01, జూనియర్‌ ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌ –01, ఆఫీస్‌ అసిస్టెంట్‌–04, స్టెనోగ్రాఫర్‌–05, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌–04, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌–14, ల్యాబొరేటరీ అటెండెంట్‌–04.
»    అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్‌/స్లెట్‌/సెట్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: గ్రూప్‌–ఏ పోస్టులకు 62 ఏళ్లు, గ్రూప్‌–బి పోస్టులకు 35 ఏళ్లు, గ్రూప్‌–సి పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.07.2024.
»    వెబ్‌సైట్‌: https://uohyd.ac.in

Mega DSC: మెగా డీఎస్సీపై ఇచ్చిన మాట ఏమైంది?.. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌

#Tags