UGC NET 2024: యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)నెట్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు

యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌)–2024 రిజిస్ట్రేషన్‌ గడువును మరోసారి పొడిగించారు. నిన్న(మే15)తో దరఖాస్తుల స్వీకరణకు ముగియగా, తాజాగా ఆ గడువును మే 19 వరకు పొడిగిస్తున్నట్లు యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ పేర్కొంది. యూనివర్శిటీల్లో జూనియర్‌ రీసెర్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు, పీహెచ్‌డీలో ప్రవేశాలకు ఈ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. అభ్యర్థులు ugcnet.nta.ac.in. వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

సబ్జెక్ట్‌లు: అడల్డ్‌ ఎడ్యుకేషన్, ఆంత్రోపాలజీ, అరబ్‌ కల్చర్‌ అండ్‌ ఇస్లామిక్‌ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్‌ సైన్స్, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్, హోం సైన్స్, హిస్టరీ, ఫోరెన్సిక్‌ సైన్స్, ఇండియన్‌ కల్చర్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, లింగ్విస్టిక్స్, మ్యూజిక్, సైకాలజీ, లా తదితరాలు.

అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ–ఎన్‌సీఎల్‌/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్‌ జెండర్‌ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు అవసరం.

TS CPGET 2024 Notification: సీపీగెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. రిజిస్ట్రేషన్‌కు చివ‌రి తేది ఇదే..


వయసు: జేఆర్‌ఎఫ్‌కు 01.06.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు గరిష్ట వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం: ఓఎమ్మార్‌ ఆధారిత విధానంలో పరీక్ష  ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్‌ టైప్, మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌–1లో 50 ప్రశ్నలు(100 మార్కులు), పేపర్‌–2లో 100 ప్రశ్నలు(200 మార్కులు) కేటాయించారు. పరీక్షకు మూడు గంటల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 19 వరకు
పరీక్ష తేది: జూన్‌ 18, 2024

#Tags