TS EAPCET 2024: ఈనెల 11న టీఎస్ ఎంసెట్ ప్రిలిమినరీ కీ విడుదల
తెలంగాణలో ఈఏపీసెట్ (EAPCET) 2024 పరీక్షల ప్రిలిమినరీ కీని మే11న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. TS EAPCET 2024 పరీక్ష రాసిన అభ్యర్థులు మే 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా మే 7, 8 తేదీల్లో ఈఏపీసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరగిన విషయం తెలిసిందే. తర్వాత మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతున్నాయి.
#Tags