AP DEECET 2024: ఈనెల 24న డీఈఈ సెట్ ప‌రీక్ష‌.. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ఇలా!

డీఈఈ సెట్ ప‌రీక్ష రాసే అభ్య‌ర్థుల‌కు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్‌కుమార్ సూచ‌న‌లు..

విజయనగరం: డీఈఈసెట్‌–2024 ఈ నెల 24న ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌.ప్రేమకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులంతా హాల్‌టిక్కెట్లను cse.ap.gov.in, apdeecet.apcfss.in వెబ్‌సైట్‌ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Medical College Development: వైద్య క‌ళాశాల అభివృద్ధిలో ఏపీ సీఎం కృషి..

నగర శివారులోని చిన్మయానగర్‌ ఎల్‌ఆర్‌జీ స్కూల్‌ పక్కన ఉన్న నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ చర్చ్‌ సోషల్‌ యాక్షన్‌ ఇండియా భవనాన్ని పరీక్ష కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంటముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్‌ టికెట్‌తో ఫొటో రానివారు ఒక పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోతో పాటు ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆధార్‌కార్డు, పాన్‌కార్డు లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ వెంట తీసుకురా వాలని సూచించారు.

Certificate Courses: వ్యవసాయ విద్యకు సర్టిఫికెట్‌ కోర్సులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!

#Tags