NCC Training : పది రోజులపాటు ఎన్‌సీసీ శిక్షణ తరగతులు..!
కూడేరు: ఎన్‌సీసీ శిక్షణతో ఉన్నత భవిష్యత్తు ఉంటుందని క్యాడెట్లకు సీఏటీసీ–1 ఎన్‌సీసీ క్యాంప్ కమాండర్ కెప్టెన్ కల్నల్ కులకర్ణ సూచించారు. గురువారం కూడేరు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న ఎన్‌సీసీ నగర్‌లో సీఏటీసీ–1 ఎన్‌సీసీ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్యాంప్ కమాండర్ ఎన్‌సీసీ క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడారు.
10 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు కొనసాగుతాయన్నారు. ఇక్కడ నేర్పించే ప్రతి అంశం జీవితంలో ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. కాబట్టి క్యాడెట్లు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సుబేదార్ సుల్దార్‌సింగ్, ఎన్‌సీసీ అధికారులు, కర్నూలు, నద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన 560 మంది క్యాడెట్లు పాల్గొన్నారు.
ITI Counselling 2024: ప్రారంభమైన ఐటీఐ కౌన్సెలింగ్, ఎప్పటివరకంటే..