TS Entrance Exams 2024: ఫిబ్రవరి మొదటి వారంలో 'CETs' షెడ్యూల్ ?

రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు(సెట్స్) షెడ్యూల్ వచ్చేనెల మొదటివారంలో వెలువడే అవకాశం ఉంది.

గతేడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా, ఈసారి కూడా మొదటి వారం లేదా రెండో వారంలో ప్రకటించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఎంసెట్, ఇసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షల ప్రక్రియను ఉన్నత విద్యామండలి ప్రారంభించినట్లు సమాచారం.

College Predictor - 2023 AP EAPCET TS EAMCET

ఈ మేరకు యూనివర్సిటీలను ఖరారు చేసి, ఆయా సెట్లకు కన్వీనర్ల నియామకం కోసం యూనివర్సిటీలకు లేఖలు రాసినట్లు తెలిసింది. యూనివర్సిటీలు తమ పరిధిలోని సెట్‌కు కన్వీనర్‌ను నియమించేందుకు ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను సిఫారసు చేస్తే అందులో ఒకరిని ఆయా సెట్‌లకు కన్వీనర్లుగా ఉన్నత విద్యామండలి నియమించనుంది. ఈసారి సెట్ల కన్వీనర్లు కొంతమంది మారనున్నట్లు సమాచారం.

#Tags