AP PGCET 2024 Counselling: ఏపీ పీజీసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల,వెబ్‌ ఆప్షన్లు ఎప్పటివరకంటే..

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ప్రవేశాలకు సంబంధించిన ఏపీ పీజీసెట్‌– 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. జూన్‌ 10 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసింది. విద్యార్థులు తమ ర్యాంకు, రిజర్వేషన్‌ రోస్టర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో 16 పీజీ కోర్సుల్లో 559 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వర్సిటీ అనుబంధంగా ఏడు ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో మరో 556 సీట్లు ఉన్నాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం మహిళల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సైతం పీజీ కోర్సులు నిర్వహిస్తున్నాయి.

TS CPGET Results 2024 Release Date : సీపీగెట్-2024 ఫలితాలు విడుదల..నేడే .. ఫ‌లితాల కోసం..

ఈ నెల 12 వరకు విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. పీజీ సెట్‌లో ర్యాంకు సాధించిన వారు మాత్రమే అర్హులు. వీరికి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. పూర్తి వివరాలకు ఏపీఎస్‌హెచ్‌ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

షెడ్యూల్‌ మేరకు ఈ నెల 12లోపు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. పీజీ సెట్‌ అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌ సద్వినియోగం చేసుకోవాలి. వర్సిటీ, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– పి.సుజాత,రిజిస్ట్రార్‌, బీఆర్‌ఏయూ

#Tags