AP ECET Results Released: ఈసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఈసెట్)ఫలితాలు విడుదల అయ్యాయి. నేడు ఉదయం 11 గంటలకు అనంతపురం- జేఎన్‌టీయూలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి,ఈసెట్ ఛైర్మన్ శ్రీనివాసరావు ఫలితాలను వెల్లడించారు.
ఈనెల 8న ఈసెట్ పరీక్షలు జరగ్గా, రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. ఈసెట్ ఫలితాల్లో 90.41 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఏపీ ఈసెట్ ఫలితాల కోసం డైరెక్ట్ లింక్ https://results.sakshieducation.com/Results2024/Andhra-Pradesh/ECET/2024/ap-ecet-2024-results.html ను క్లిక్ చేయండి.
How to check AP ECET Results 2024:
- results.sakshieducation.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న AP ECET 2024 ఫలితాలు లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి, సమర్పించు క్లిక్ చేయండి.
- మీ AP ECET 2024 మార్కులు మరియు ర్యాంక్ ప్రదర్శించబడతాయి.
- తదుపరి సూచనల కోసం ఫలితాలను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
#Tags