IITH: సీఎం చేతులమీదుగా ఐఐహెచ్‌టీ ప్రారంభం.. ఏటా ఇంత‌ మంది విద్యార్థులుకు డిప్లొమా కోర్సు

సాక్షి, హైదరాబాద్‌: చేనేత రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త కోర్సుల్లో శిక్ష ణ ఇచ్చేందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని సీఎం రేవంత్‌రెడ్డి సెప్టెంబర్ 9న‌ ప్రారంభించనున్నా రు.

అలాగే నేతన్నకు చేయూత పథకం కింద 36,133 మంది లబ్ధిదారులకు రూ. 290 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని వ్యవ సాయ, మార్కెటింగ్, సహకార, జౌళిశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెప్టెంబర్ 8న‌ ఓ ప్రకటనలో తెలిపారు.

చదవండి: IITH: విపత్తుల సమయంలో ఎదుర్కొనేందుకు.. ఐఐటీహెచ్‌లో బాహుబలి డ్రోన్‌ తయారీ!

ఐఐహెచ్‌టీలో ఏటా 60 మంది విద్యార్థులు చేనేత, జౌళి సాంకేతికతలో మూడేళ్ల డిప్లొమా కోర్సును అభ్యసించడానికి అవకాశం లభిస్తుందన్నారు. ఈ డిప్లొమాతో ప్రభుత్వరంగ జౌళి సంస్థలతోపాటు ప్రైవేటు టెక్స్‌టైల్, అపెరల్‌ ఇండస్ట్రీస్, ఫ్యాషన్‌ సెక్టార్‌లలో ఉత్పత్తి, క్వాలిటీ కంట్రోల్, మార్కెటింగ్‌ విభాగాలలో విద్యార్థులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.  

#Tags