Engineering Admissions : సర్కారు కాలేజీల్లో ఏటా పెరుగుతున్న మిగులు సీట్లు.. విద్యార్థుల ఆసక్తి ఇదేనా..!
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థులకు పెద్ద పెద్ద యూనివర్సిటీలు అంటే.. ఉస్మానియా లేదా జేఎన్టీయూలో ఇంజినీరింగ్‌లో సీటు లభిస్తే చాలా గొప్ప విషయం, విద్యార్థులంతా గంతులేస్తారు. కాని, ఇప్పడు అలాంటి సర్కారు ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్లు ఇంకా మిగులుతున్నాయి. 2020-21 విద్యాసంవత్సరంలో 17 శాతం మిగలగా, 2023-24 లోనైతే ఏకంగా 33 శాతం సీట్లు మిగిలాయి.
2023-24 విద్యాసంవత్సరంలో ఆయా కాలేజీల్లో 67 శాతం మాత్రమే భర్తీ కాగా, రాష్ట్రంలో 19 ప్రభుత్వ, 155 ప్రైవేట్ కాలేజీలున్నాయి. విద్యార్థుల్లో కొందరు ఇంజినీరింగ్‌కు ప్రాధాన్యమిస్తే మరి చాలామంది ఇతర కోర్సులు అంటే, ఐఐటీ లేదా ఎన్ఐటీ కోర్సుల్లో చేరుతున్నారు. దీంతో సర్కారు కాలేజీలలో ప్రవేశాలకు సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో ఇకపై ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు అయిన తర్వాతే ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు. అయినా అత్యంత ప్రధానమైన ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు నిండటంలేదు.
రాష్ట్రంలో 18 యూనివర్సిటీ కాలేజీలుండగా 5,907 సీట్లకు 5,014 సీట్లు భర్తీ కాగా 893 ఖాళీగా ఉన్నాయి. 2 ప్రైవేట్ వర్సిటీల్లో 98.91 సీట్లు భర్తీకాగా, 154 ప్రైవేట్ కాలేజీల్లో 94.88 శాతం భర్తీ అయ్యాయి. 87 కాలేజీల్లో వందశాతం సీట్లు భర్తీకాగా, వీటిలో 80 ప్రైవేట్ కాలేజీలే ఉన్నాయి. ఏడు మాత్రమే యూనివర్సిటీ కాలేజీలున్నాయి.
Job Chart and Promotions : ఉద్యోగులకు జాబ్ చార్టు, ఉద్యోగోన్నతులపై ఆత్మీయ సమావేశం..