KTR|Basara IIIT : స్పందించిన కేటీఆర్‌.. ఫ‌లించ‌ని చర్చలు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: బాసర ట్రిపుల్‌ ఐటీలో(రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం)లో విద్యార్థులు ఆందోళనలకు దిగారు.
IIIT Basara

ట్రిపుల్‌లో తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నామని విద్యార్ధులు.. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. జూన్ 15వ తేదీన (బుధవారం) విద్యార్థులుతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అధికారుల ముందు విద్యార్థులు 12 డిమాండ్లను ఉంచారు. విద్యార్థులు డిమాండ్లకు అధికారులు ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమైనట్టు సమాచారం. దీంతో, విద్యార్థులు తలపెట్టిన ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల‌ డిమాండ్లు ఇవే..?

విద్యార్థులకు పెట్టే భోజనంలోనూ..
అంతకుముందు విద్యార్థులు.. మెస్‌లో భోజనం సరిగా లేదని, కరెంట్‌ ఉండటం లేదని, వాటర్‌ సమస్య వెంటాడుతోంది ఆరోపించారు. అలాగే, విద్యార్థులకు కనీసం ల్యాప్ టాప్స్‌ కూడా ఇవ్వడంలేదని ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల నుంచి బాసర ట్రిపుల్‌ ఐటీ లోపలికి మీడియాను అధికారులు అనుమతించడం లేదని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు. వారికి కూడా లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయటే కూర్చుని నిరసనలు తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలోనూ విద్యార్థులకు పెట్టే భోజనంలో బొద్దింకలు, బల్లులు రావడంతో వారు ఆందోళన చేపట్టారు. 

సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం..: కేటీఆర్‌
విద్యార్థుల ఆందోళనలపై ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ట్రిపుల్‌ ఐటీలో సమస్యలను తెలంగాణ సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ట్రిపుల్‌ ఐటీ విద్యా నాణ్యతను పెంచేందుకు, సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, ఆందోళన చెందకండి అంటూ ట్విట్టర్‌ వేదికగా హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. ట్రిపుల్‌ ఐటీలో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఈ విషయంపై జూన్ 15వ తేదీన (బుధవారం).. వైస్‌ ఛాన్స్‌లర్‌(వీసీ)తో సమావేశం కానున్నట్టు తెలిపారు.

విద్యార్థుల ప్ర‌ధాన‌ డిమాండ్లు ఇవే.. 
☛ తెలంగాణ ముఖ్య‌మంత్రి  కేసీఆర్‌ వర్సిటీని సందర్శించాలి. 
☛ రెగ్యులర్‌ వీసీని నియమించాలి. ఆయన క్యాం పస్‌లోనే ఉండాలి. 
☛ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్యను పెంచాలి. 
☛ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ ఆధారిత విద్యను అందించాలి.
☛ ఇతర వర్సిటీలు, సంస్థలతో వర్సిటీని అనుసంధానం చేయాలి.
☛ తరగతి, హాస్టల్‌ గదులకు మరమ్మతులు చేయాలి. 
☛ ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్, మంచాలు, బెడ్లు అందించాలి. 
☛ మెస్‌ల మెయింటెనెన్స్‌ మెరుగ్గా ఉండేలా చూడాలి. 
☛ పీడీ, పీఈటీలను నియమించి క్రీడలనూ ప్రోత్సహించాలి.

#Tags