AI at the Crossroads: ఏఐ వినియోగానికి సవాలుగా హ్యాకింగ్‌ రిస్కులు

న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) గణనీయంగా ప్రాచుర్యంలోకి వస్తున్నప్పటికీ దీన్ని వినియోగించుకోవడంలో కంపెనీలు కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి.

హ్యాకింగ్, సైబర్‌ దాడులు వంటి రిస్కులే ఏఐ వినియోగానికి అతి పెద్ద సవాళ్లుగా ఉంటున్నాయని ఒక సర్వేలో 92% మంది భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రైవసీ రిస్కులు కారణమని 91% మంది, నియంత్రణపరమైన అనిశ్చితి కారణమని 89% మంది తెలిపారు.

డెలాయిట్‌ ఏషియా పసిఫిక్‌ రూపొందించిన ‘ఏఐ ఎట్‌ క్రాస్‌రోడ్స్‌’ నివేదికలో ఈ అంశాలు వెల్లడి అయ్యాయి. ఏఐ సంబంధ రిస్కులను ఎదుర్కొనడంలో తమ సంస్థలకు తగినంత స్థాయిలో వనరులు లేవని 50 శాతం మంది పైగా టెక్‌ వర్కర్లు తెలిపారు.

చదవండి: IT Companies : ఈ నివేదిక ప్ర‌కారం.. ఇక ఐటీ కంపెనీలు, ఉద్యోగుల ప‌రిస్థితి ఇంతేనా..!

గవర్నెన్స్‌పరంగా పటిష్టమైన విధానాలను పాటించడం, నిరంతరం కొత్త సాంకేతికతల్లో శిక్షణ పొందాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోందని డెలాయిట్‌ వివరించింది. అయితే, ఏఐ వినియోగంపై ఆశావహ భావం కూడా ఉన్నట్లు పేర్కొంది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

నైతిక విలువలతో వినియోగించేందుకు 60% మంది ఉద్యోగులకు నైపుణ్యాలు ఉన్నాయని, ఉద్యోగాల్లో నైపుణ్యాలపరంగా ఉన్న అంతరాలను తొలగించేందుకు 72% సంస్థలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయని నివేదిక వివరించింది. 13 మార్కెట్లవ్యాప్తంగా 900 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సర్వేలో పాల్గొన్నారు. 

#Tags