Engineering Branch Wise Seats: ఎట్టకేలకు విడుదలైన కాలేజీలు, సీట్ల జాబితా.. ఏ బ్రాంచీలో ఎన్ని సీట్లు?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల లెక్క పాక్షికంగా తేలింది. ఆఖరి నిమిషంలో కాలేజీలకు విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు లభించింది.

దీంతో ఈఏపీసెట్‌ అర్హత పొంది, కౌన్సెలింగ్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు సోమవారం నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 15 వరకు ఈ అవకాశం ఉంటుంది. సాంకేతిక విద్యా విభాగం అందించిన సమాచారం ప్రకారం తొలిదశ ఆప్షన్లు ఇచ్చే నాటికి 173 కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. 

చదవండి: College Predictor - 2024 (AP & TG EAPCET, POLYCET & ICET)

మొత్తం 98,296 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కన్వీనర్‌ కోటా కింద 70,307 సీట్లు భర్తీ చేయనున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 1.18 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు వివిధ విభాగాల్లో ఉండాలి. కానీ కొన్ని కాలేజీలు సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ వంటి బ్రాంచీల్లో సీట్లు, సెక్షన్లు తగ్గించుకున్నాయి. వాటి స్థానంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్‌ కోర్సులు కావాలని దరఖాస్తు చేసుకున్నాయి. 

చదవండి: Top 20 Engineering (Branch wise) Colleges in Telangana - Click Here

పెరిగే సీట్ల వివరాలకు ఇంకా ప్రభుత్వం అనుమతి లభించలేదు. దీంతో కోత పడే సీట్లుపోను మిగతా వాటిని కౌన్సెలింగ్‌లో చేర్చారు. సాంకేతిక విద్య కమిషనర్‌ దేవసేన ఆదివారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇందులో 60 శాతానికిపైగా సీట్లు కంప్యూటర్‌ కోర్సుల్లోనే ఉన్నాయి.

యూనివర్సిటీ

కాలేజీలు

సీట్లు

కన్వీనర్‌ కోటా సీట్లు

ఉస్మానియా

15

8,970

6,528

జేఎన్‌టీయూహెచ్‌

134

80,913

56,564

కాకతీయ

3

1,260

882

ప్రైవేటు వర్సిటీలు

21

7,153

6,603

మొత్తం

173

98,296

70,703

బ్రాంచీ

సీట్లు

అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌

30

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌

42

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌

1,365

ఏఐఎంఎల్‌

606

ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌

168

ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌

42

బయో మెడికల్‌

59

బిల్డింగ్‌ సర్వీసెస్‌ ఇంజనీరింగ్‌

60

కెమికల్‌ ఇంజనీరింగ్‌

204

సీఎస్‌ఈ (ఐవోటీ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ)

126

సివిల్‌ ఇంజనీరింగ్‌

3,231

కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌

84

కంప్యూటర్‌ సైన్స్, బిజినెస్‌ సిస్టం

252

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (సైబర్‌ సెక్యూరిటీ)

1,418

సీఎస్‌ఈ (డేటాసైన్స్‌)

6,516

సీఎస్‌సీ

21,599

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ డిజైన్‌

84

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఐటీ

210

సీఎస్‌ఈ (ఏఐఎంఎల్‌)

11,196

సీఎస్‌ïఈ (నెట్‌వర్క్‌)

42

సీఎస్‌ఈ (ఐవోటీ)

315

కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ (సాఫ్ట్‌వేర్‌)

126

డైరీయింగ్‌

23

డిజిటల్‌ టెక్నాలజీ ఫర్‌ డిజైన్‌ ప్లానింగ్‌

60

ఈసీఈ

10,398

ఈసీ–ఇనుస్ట్రుమెంట్‌ ఇంజనీరింగ్‌

42

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌

42

ఈఈఈ

4,202

ఎలక్ట్రానిక్స్, ఇనుస్రుమెంటేషన్‌

126

ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్‌

21

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలిమ్యాటిక్స్‌

42

ఫుడ్‌ టెక్నాలజీ

90

జీయో ఇన్‌ఫ్రామాటిక్స్‌

60

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ

3,705

మెకానికల్‌ (మెకట్రానిక్స్‌) ఇంజనీరింగ్‌

42

మెకానికల్‌ ఇంజనీరింగ్‌

2,979

మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌

60

మైనింగ్‌ ఇంజనీరింగ్‌

264

బీటెక్‌ మెకానికల్‌ విత్‌ ఎంటెక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సిస్టం

30

మెటలర్జి, అండ్‌ మెటీరియల్‌

42

బిటెక్‌ మెకానికల్‌ విత్‌ ఎంటెక్‌ థర్మల్‌ ఇంజనీరింగ్‌

30

ఫార్మాస్యూటికల్స్‌ ఇంజనీరింగ్‌

42

బి ప్లానింగ్‌

40

టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, ఇంజనీరింగ్‌

120 

#Tags