OU PhD: కిరణ్ కుమార్ కు OU కెమికల్ ఇంజినీరింగ్ లో పీహెచ్ డీ

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్),చర్లపల్లి, హైదరాబాద్ లోని సిపెట్ చీఫ్ మేనేజర్ వి.కిరణ్ కుమార్ కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ లో పీహెచ్ డీ లభించింది.
కిరణ్ కుమార్ కు OU కెమికల్ ఇంజినీరింగ్ లో పీహెచ్ డీ

ఉస్మానియా విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజనీరింగ్ విభాగం నుండి V.Kiran Kumar డాక్టరేట్ పొందినట్లు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ , ఉస్మానియా యూనివర్శిటీ ప్రిన్సిపల్ చింత సాయిలు ,కెమికల్ ఇంజినీరింగ్ అధిపతి శ్రీను నాయక్ ప్రకటించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని కెమికల్ ఇంజినీరింగ్ విభాగపు విశ్రాంత ఆచార్యులు ఈటకుల నాగ భూషన్ మార్గ దర్శ కత్వము లో  “పాలీప్రొపైలిన్ కో-పాలిమర్ యొక్క మెకానికల్, థర్మల్ లక్షణాలపై MWCNT మరియు వివిధ రకాల MAgPP యొక్క ఉమ్మడి ప్రభావం” అనే అంశం పై సిద్ధాంత గ్రంధాన్ని వర్సిటీ కి సమర్పించినట్లు వివరించారు. ఇందుకు గాను అతడికి డాక్టరేట్ డిగ్రీ నీ ప్రధానం చేసినట్లు వెల్లడించారు.

అతను పలు జాతీయ ,అంతర్జాతీయ పరిశోధన జర్నల్స్ లలో అనేక పరిశోధనలు వ్యాసాలను ప్రచురించినట్లు తెలిపారు.

చదవండి: UGC Latest Guidelines: పీహెచ్‌డీ లేకున్నా.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌!
ఈ పరిశోధన, Nano ప్లాస్టిక్ కంపోజిట్స్‌ను తయారు చేయడానికి MWCNT & MAgPP,PP Co-polymer పదార్థాలను ఉపcయోగించి పరిశోధన చేయడంపై దృష్టి కేంద్రీకృతమైంది. ఈ పదార్థాలను ఉపయోగించడం ద్వారా, మనం పర్యావరణానికి హాని కలిగించకుండా మరియు భవిష్యత్ తరాల అవసరాలను తీర్చగల విధంగా PPCP nano ప్లాస్టిక్ కంపోజిట్స్‌ను ఉత్పత్తి చేయవచ్చు.

#Tags