TS DSC Results 2024 Release Date : టీఎస్ డీఎస్సీ-2024 ఫలితాల విడుద‌ల తేదీ ఇదే..? అలాగే 'కీ' కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎన్నో ఆటంకాలు మ‌ధ్య ఎట్ట‌కేల‌కు టీఎస్ డీఎస్సీ-2024 ప‌రీక్ష‌లు ఆగ‌స్టు 5వ తేదీతో ముగిసాయి. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన త్వరలోనే ఆన్సర్‌ 'కీ' ని ఆగ‌స్టు రెండో వారంలో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

ఈ మేర‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఫ‌లితాల‌ను కూడా ఈ నెల చివ‌రి వారంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఎలాగైన సెప్టెంబర్ 5వ తేదీన‌ ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా.. డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు నియాక పత్రాలను అందజేయాలని ప్రభుత్వం ఆలోచ‌న‌లో ఉంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి ప్రకటన జారీ చేయ‌నున్నారు.

➤ Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

ఈ పరీక్షకు మొత్తం..

మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పోస్టుల వారీగా చూస్తే 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి.

#Tags