రెండో రోజు టీఎస్‌ ఎంసెట్‌కు 49 వేల మంది హాజరు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష రెండో రోజు గురువారం ప్రశాంతంగా జరిగిందని కన్వీనర్‌ గోవర్ధన్‌ తెలిపారు.
54,948 మందికి 49,406 మంది (89.91%) హాజరయ్యారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎంసెట్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్‌ ప్రవేశాల కోసం మూడు రోజులు ఆరు సెషన్లలో ఈ పరీక్ష జరగనుంది.

చ‌ద‌వండి: ‘ఈ విద్యార్థులకు వీఐటీ–ఏపీలో ఫీజు మినహాయింపు’

చ‌ద‌వండి: 6 రకాలుగా స్కూళ్ల వర్గీకరణ... దీనితో 44 వేల నుంచి 58 వేలకు పెరగనున్న స్కూళ్లు..
#Tags