Engineering: ఫీజుల‌పై క్లారిటీ వ‌చ్చాకే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌...?

ఏపీలో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడే అవకాశం క‌న్పిస్తోంది. కళాశాలలకు సంబంధించిన ఫీజుల విష‌యంలో స్ప‌ష్ట‌త‌కొర‌వ‌డ‌డ‌మే ఇందుకు కార‌ణంగా తెలుస్తోంది. ముందుగా వెల్ల‌డించిన షెడ్యూల్ మేర‌కు ఈనెల 3వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్ష‌న్స్ నమోదు వాయిదా పడనుంది. 
ఫీజుల‌పై క్లారిటీ వ‌చ్చాకే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌...?

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఈఏపీసెట్‌-2023 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభ‌మైన విష‌యం తెల్సిందే. జులై 24వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. ఆగస్టు 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ వెబ్‌ ఆప్షన్ల ఎంపిక, 9వ తేదీ వెబ్‌ ఆప్షన్ల మార్పు, ఆగస్టు 12న సీట్ల కేటాయింపు జరుగుతుంది.

Top 20 Engineering Colleges 2023 Andhra Pradesh Telangana

ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ నిర్ణయించిన ఫీజులు తక్కువగా ఉన్నాయంటూ ఇటీవల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. న్యాయస్థానం సూచన ప్రకారం క‌ళాశాల‌ల యాజ‌మాన్యాలు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. ఈ తంతు ముగిసిన త‌ర్వాత కౌన్సెలింగ్ కొత్త తేదీలను అధికారులు ప్ర‌క‌టించ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో కనీస ఫీజు రూ.35వేలు కాగా.. గరిష్టంగా రూ.70వేలు ఫీజు అమ‌లులో ఉంది.

➤☛ AP EAPCET College Predictor (Click Here)

ఆగస్టు 13వ తేదీ నుంచి 14 వరకూ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, లేదా నేరుగా కళాశాలకు వెళ్లి రిపోర్ట్‌ చేయడం, ఆగస్టు 16 నుంచి ఇంజినీరింగ్‌, ఫార్మసీ తరగతులు నిర్వహిస్తారు.

చ‌ద‌వండి: క‌ష్టాల‌ను అధిగ‌మించి.. నాసాలో కొలువు సాధించా... పులివెందుల‌ కుర్రాడు హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌రెడ్డి స‌క్సెస్ స్టోరీ

#Tags