TS TRT New Exam Dates 2023 : టీఎస్ డీఎస్సీ ప‌రీక్ష‌ల షెడ్యూల్..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : 5089 ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వం డీఎస్సీ నోటిఫికేష‌న్‌ను సెప్టెంబ‌ర్ 8వ తేదీ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. అయితే డీఎస్సీ ద‌ర‌ఖాస్తు గడువు అక్టోబర్ 21 తో ముగియనుండగా.. అభ్య‌ర్థుల విజ్ఞప్తి మేరకు అక్టోబర్ 28 వరకు దరఖాస్తు గడువు పెంచుతూ విద్యాశాఖ కీల‌క‌ నిర్ణయం తీసుకున్న విష‌యం తెల్సిందే.
ts trt exam dates 2023

ఈ టీఆర్‌టీ పరీక్షల‌ నిర్వహణ తేదీలపై విద్యాశాఖ అధికారులు ఒక‌ ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. అలాగే  డీఎస్సీ పరీక్షల నిర్వహణ తేదీలపై విద్యాశాఖ అధికారులు ఒక అంచనాకి వచ్చారని సమాచారం.

☛ తెలంగాణ డీఎస్సీ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

చివరి వారంలో..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో డీఎస్సీ ప‌రీక్ష‌ల తేదీల‌ను మార్పు చేసిన విష‌యం తెల్సిందే. వాయిదాప‌డ్డ‌ ఈ డీఎస్సీ పరీక్షలు.. జనవరి 2024 చివరి వారం లేదా ఫిబ్రవరి 2024 మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ టీఆర్‌టీ పరీక్షలు నిర్వహణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.

ద‌ర‌ఖాస్తులు పెరిగే అవ‌కాశం..

ఇప్పటివరకు దాదాపు 1,56,449 మంది దరఖాస్తు ఫీజు చెల్లించగా 1,50,202 మంది దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. డీఎస్సీ దరఖాస్తు గడువు అక్టోబర్ 28వ తేదీ వరకు పెంచ‌డంతో ఈ దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది.

#Tags