TS DSC 2024 Key Released : టీఎస్ డీఎస్సీ-2024 'కీ' విడుద‌ల‌.. ఫ‌లితాల విడుద‌ల తేదీ ఇదే..! ఈ ప్ర‌శ్న‌లకు మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : టీఎస్ డీఎస్సీ-2024 ప‌రీక్ష‌లు జులై 18న ప్రారంభమైన.. ఆగ‌స్టు 5వ తేదీతో ముగిసిన విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ప్రాథమిక 'కీ'ని ఆగ‌స్టు 13వ తేదీ (మంగ‌ళ‌వారం) విడుద‌ల చేశారు.

మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయగా మొత్తం 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప‌రీక్ష‌కు మాత్రం.. 2,45,263 మంది హాజరయ్యారు.

పోస్టుల వారీగా చూస్తే 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి.

అభ్యర్థులకు 'కీ'పై అభ్యంతరాలు ఉంటే..
ts dsc 2024 'కీ' ని విద్యాశాఖ అధికారులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులకు 'కీ'పై అభ్యంతరాలను ఆగ‌స్టు 13వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు తెలపవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తెలిపారు.

TS DSC 2024 ఫ‌లితాల‌ను కూడా..

అలాగే ts dsc 2024 ఫ‌లితాల‌ను కూడా ఈ నెల చివ‌రి వారంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఎలాగైన సెప్టెంబర్ 5వ తేదీన‌ ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా.. డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు నియాక పత్రాలను అందజేయాలని ప్రభుత్వం ఆలోచ‌న‌లో ఉంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి ప్రకటన జారీ చేయ‌నున్నారు.

☛➤ TS DSC Key 2024 కోసం క్లిక్ చేయండి

#Tags