Teacher Posts: డీఎస్సీలో పోస్టుల సంఖ్య పెంచాలి

ఆదిలాబాద్‌: డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టు ల సంఖ్య పెంచాలని నిరుద్యోగ అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ లైబ్రరీలో జూన్ 24న‌ ఆందోళన నిర్వహించారు.

ప్లకార్డులు ప్రదర్శించి, పెద్ద ఎత్తున నినా దాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను ఈ డీఎస్సీలోనే జతచేసి పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.

చదవండి: Gurukula Teachers: గురుకుల టీచర్లకూ అవే సౌకర్యాలివ్వాలి

ఈ ప్రక్రియ ద్వారా జిల్లాలో పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తొలిసారిగా టెట్‌ అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రిపరేషన్‌ కోసం సమయం తక్కువగా ఉన్నందున, డీఎస్సీ పరీక్షల తేదీలను వాయిదా వేయాలని కోరారు. కార్యక్రమంలో నిరుద్యోగులు దత్తు, సచిన్‌, సాయి, సాత్విక్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags