TG DSC 2024: కార్మిక కుటుంబాల ఇంట ప్రభుత్వ కొలువులు

ముస్తాబాద్‌(సిరిసిల్ల): డీఎస్సీలో ముస్తాబాద్‌ మండలానికి చెందిన అభ్యర్థులు సత్తాచాటారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు అందుకోనున్న అభ్యర్థుల నేపథ్యం ఇదీ..

బీడీ కార్మిక కుటుంబం నుంచి..

ముస్తాబాద్‌కు చెందిన కొంక రాజు, జ్యోతి దంపతులలిద్దరూ బీడీ కార్మికులే. వీరి పెద్ద కుమారుడు కొంక రాము ఎస్జీటీ పోస్టులో జిల్లాలో 23 ర్యాంకు సాధించాడు. బీడీ కార్మిక కుటుంబం నుంచి వచ్చిన రాము ఒకవైపు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ సొంతంగా ప్రిపేర్‌ అయ్యాడు.

కార్మికురాలి ఇంటా ఉపాధ్యాయురాలు

గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన చింతల విద్యారాణి ఎస్జీటీ పోస్టు సాధించింది. తండ్రి శ్రీనివాస్‌ బీడీ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లి బీడీ కార్మికురాలు. ఇంటర్‌ వరకు గంభీరావుపేటలో చదివిన విద్యారాణి, డీఎడ్‌ వరంగల్‌లో చేసింది. పేద కుటుంబానికి చెందిన ఆమె డీఎస్సీలో 33వ ర్యాంకు సాధించి ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికై ంది.

చదవండి: Kothapally Sai: పోలీస్‌ జాబ్‌ వదిలి.. ఉపాధ్యాయ వృత్తిలోకి

తండ్రి కల నెరవేర్చిన తనయులు 

వీర్నపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడాలన్న తండ్రి కలను సాకారం చేశారు తనయులు. కానీ ఆ సంతోషా న్ని చూడకుండానే నాన్న మృతి చెందడాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఉమ్మడి మద్దిమల్లలోని బంజేరు గ్రామానికి చెందిన కన్నం మల్ల య్య– మణేవ్వ దంపతుల కుమారులు గంగయ్య, జనార్దన్‌ ఎస్జీటీలు ఉద్యోగం సాధించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్నప్పు డు తండ్రి హఠాన్మరణం చెందడం ఆ కుటుంబంలో విషా దం నింపింది. తండ్రి మరణం దిగమింగుతూ మరోపక్క డీఎస్సీ–2008కి ప్రిపేర్‌ అ య్యారు. అప్పుడు గంగయ్య ఉద్యోగానికి ఎంపిక కాగా, జనార్దన్‌ అరమార్కుతో ఉద్యోగం కోల్పోయాడు. మళ్లీ ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. కానీ తన తండ్రి కలను సాకారం చేయాలని జనార్దన్‌ పట్టుదలతో శ్రమించి డీఎస్సీ–2024లో ఎస్జీటీగా ఎంపికయ్యాడు.

#Tags