DSC Free Coaching: ఉచితంగా డీఎస్సీ కోచింగ్‌.. దరఖాస్తు చేసుకోండి

గిరిజన యువతకు ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇవ్వ‌నున్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జిల్లాలో డీఎస్సీకి సన్నద్ధమయ్యే గిరిజన యువతకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన ఆగ‌స్టు 21వ తేదీ ఓ ప్రకటనలో తెలిపారు. బీఈడీ, డీఎడ్‌, టెట్‌ ఉత్తీర్ణులైన గిరిజన అభ్యర్థులను వారి మార్కుల మెరిట్‌ లేదా స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. 

మహిళలను 33 శాతం రిజర్వేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారని వివరించారు. ఆయా కోర్సులు పూర్తి చేసిన గిరిజన యువత పూర్తి బయోడేటాతోపాటు విద్యార్హత, కులధ్రవీకరణ పత్రం, రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, పాస్‌ పోర్టు సైజు ఫొటో, అర్హత సర్టిఫికెట్లు జత చేసి పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా గిరిజన అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. 

పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోగా కార్యాలయంలో అందజేయాలని కోరారు. మరిన్ని వివరాలకు 96663 92500 సెల్‌ నంబరులో సంప్రదించాలని సూచించారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్‌ సృజన ఆ ప్రకటనలో తెలిపారు.

Free Training for organic farming: సేంద్రియ సేద్యంపై 21 రోజుల ఉచిత శిక్షణ

#Tags