Men's Doubles Title: భారత క్రీడాకారుడు సాకేత్‌ మైనేని ఏ క్రీడలో ప్రసిద్ధుడు?

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నీలో భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు సాకేత్‌ మైనేని డబుల్స్‌ టైటిల్‌ సాధించాడు. న్యూఢిల్లీ వేదికగా మార్చి 26న జరిగిన ఫైనల్లో సాకేత్‌–యూకీ బాంబ్రీ (భారత్‌) జంట 6–4, 6–2తో విష్ణువర్ధన్‌–అనిరుధ్‌ చంద్రశేఖర్‌ (భారత్‌) జోడీపై నెగ్గింది. సాకేత్‌ కెరీర్‌లో ఇది 27వ డబుల్స్‌ టైటిల్‌.

Badminton Association of India: బాయ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి?

వెన్నం జ్యోతి సురేఖ ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?
జాతీయ సీనియర్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఆరోసారి చాంపియన్‌గా నిలిచింది. జమ్మూలో జరిగిన ఈ టోర్నీలో పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (పీఎస్‌పీబీ) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ విజయవాడ ఆర్చర్‌ మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో 146–143తో ప్రియా గుర్జర్‌ (రాజస్తాన్‌)పై గెలిచింది. ర్యాంకింగ్‌ రౌండ్‌లో సురేఖ 720 పాయింట్లకుగాను 699 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

Indian Premier League 2022: డీవై పాటిల్‌ క్రీడా మైదానం ఏ రాష్ట్రంలో ఉంది?

56వ క్రాస్‌కంట్రీ చాంపియన్‌షిప్‌ను ఎక్కడ నిర్వహించారు?
నాగాలాండ్‌ రాష్ట్ర రాజధాని కోహిమా వేదికగా మార్చి 26న నిర్వహించిన 56వ జాతీయ క్రాస్‌కంట్రీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ హరీశ్‌ ముల్లు అండర్‌–16 బాలుర 2 కిలోమీటర్ల  రేసులో కాంస్య పతకం నెగ్గాడు. విజయనగరం జిల్లాకు చెందిన హరీశ్‌ 6 నిమిషాల 6 సెకన్లలో గమ్యానికి చేరాడు. అమన్‌ (హరియాణా; 6 నిమిషాలు) స్వర్ణం, ప్రియాన్షు (ఉత్తరాఖండ్‌; 6ని:3 సెకన్లు) రజతం సాధించారు.

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags