Wrestler Aman: రెజ్లర్‌ అమన్ సెహ్రావత్‌కు రజతం

పొల్యాక్‌ ఇమ్రి–వర్గా జోనస్‌ స్మారక ర్యాంకింగ్‌ సిరీస్‌ రెజ్లింగ్‌ టోర్నీలో భారత రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ రజత పతకం సాధించాడు.

హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో అమన్‌ పురుషుల ఫ్రీస్టయిల్‌ 57 కేజీల విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. రె హిగుచి (జపాన్‌)తో జరిగిన ఫైనల్లో అమన్‌ 1–11 పాయింట్లతో ఓడిపోయాడు. నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ ఆడిన అమన్‌ 11–1తో రొబెర్టి డింగాష్‌విలి (జార్జియా)పై, సెమీఫైనల్లో 14–4తో టిసిటర్న్‌ (బెలారస్‌)పై గెలుపొందాడు.

Paris Olympics: పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత బాక్సర్లు వీరే..

#Tags