World University Games: ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో రెండు పతకాలు ..

ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో బుధవారం భారత్‌కు రెండు పతకాలు లభించాయి.
World University Games

షూటింగ్‌లో ఇలవేనిల్‌ వలారివరన్‌–దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌ జోడీ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో రజతం సాధించారు.అథ్లెటిక్స్‌లో మహిళల లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భగవతి భవాని యాదవ్‌ కాంస్య పతకాన్ని గెల్చుకుంది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో ఇలవేనిల్‌–దివ్యాంశ్‌ ద్వయం 13–17తో యు జాంగ్‌–బుహాన్‌ సాంగ్‌ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది.
ఇక లాంగ్‌జంప్‌ ఫైనల్లో విజయవాడకు చెందిన భవాని యాదవ్‌ 6.32 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత్‌ 11 స్వర్ణాలు, 5 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.

☛☛ World University Games: ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో మూడు పతకాలు ..    

#Tags