Joshua Cheptegei: ఒలింపిక్స్‌లో చెప్తెగాయ్‌కు స్వర్ణం.. నాలుగేళ్లుగా ఈయ‌న పేరిట ఉన్న ప్రపంచ రికార్డు!

పారిస్‌ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌ పురుషుల 10,000 మీటర్ల రేసులో ఉగాండా రన్నర్‌ జోషువా చెప్తెగాయ్‌ స్వర్ణ పతకాన్ని సాధించాడు.

ఆగ‌స్టు 3వ తేదీ జరిగిన ఫైనల్లో జోషువా 26 నిమిషాల 43.14 సెకన్లలో అందరికంటే వేగంగా 10,000 మీటర్లను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో కొత్త ఒలింపిక్‌ రికార్డును నమోదు చేయడంతోపాటు ‘పారిస్‌’ గేమ్స్‌లో ఉగాండాకు తొలి పసిడి పతకాన్ని అందించాడు.   

ఒలింపిక్ రికార్డు: జోషువా 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కెనెనిసా బెకెలె (ఇథియోపియా; 27ని:01.17 సెకన్లు) నెలకొల్పిన రికార్డును ‘పారిస్‌’లో బద్దలు కొట్టాడు.
ఉగాండాకు తొలి పసిడి: ఈ విజయంతో ఉగాండాకు పారిస్ గేమ్స్‌లో తొలి స్వర్ణ పతకం లభించింది.
అంతర్జాతీయ అనుభవం: జోషువా ఇంతకు ముందు టోక్యో ఒలింపిక్స్‌లో రజతం, గత మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో 10,000 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాలు గెలుచుకున్నాడు.
ప్రపంచ రికార్డు: 2020 వాలెన్సియా మీట్‌లో జోషువా 10,000 మీటర్లను 26 నిమిషాల 11 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డును నమోదు చేసుకున్నాడు. నాలుగేళ్లుగా ఈ ప్రపంచ రికార్డు చెప్తెగాయ్‌ పేరిటే ఉంది.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో తొలిసారి స్వర్ణ పతకం కైవసం చేసుకున్న జకోవిచ్
#Tags