Skip to main content

Far Right: బ్రిటన్‌లో వలసదారులపై తీవ్ర దాడులు..

Far-Right, Anti-Immigration Riots Persist Across the UK

లివర్‌పూల్, హల్, బ్రిస్టల్, లీడ్స్, బ్లాక్‌పూల్, స్టోక్‌ ఆన్‌ ట్రెంట్, బెల్‌ఫాస్ట్, నాటింగ్‌హామ్, మాంచెస్టర్‌లలో జూలై 3వ తేదీ వలసదారులుండే హోటళ్లపై దాడులు జరిగాయి. పలు చోట్ల పోలీసులతో ఆందోళనకారులు బాహాబాహీకి దిగారు. 100 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారం క్రితం సౌత్‌పోర్ట్‌లో కత్తిపోట్లకు ముగ్గురు చిన్నారులు బలైన ఘటన అనంతరం వలసదారులే లక్ష్యంగా దాడులు సాగుతున్నాయి. శరీరం రంగును బట్టి దాడులు చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

కారణాలు ఇవే..
వలసదారులపై భయం: ఆర్థిక మందగమనం, ఉపాధి అవకాశాల కొరత వంటి కారణాల వల్ల స్థానిక ప్రజలు వలసదారులను తమ ఉపాధికి ముప్పుగా భావిస్తున్నారు.
అతివాద సంస్థల ప్రచారం: ఇంగ్లిష్ డిఫెన్స్ లీగ్ వంటి అతివాద సంస్థలు వలసదారులపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను ఉసిగిస్తున్నాయి.
రాజకీయ లాభం: కొంతమంది రాజకీయ నాయకులు వలసదారులను ప్రజాస్వామ్యం, భద్రతకు ముప్పుగా చిత్రీకరించి తమ రాజకీయ లాభం కోసం ఈ సమస్యను ఉపయోగించుకుంటున్నారు.
సామాజిక అసమానత: సామాజిక అసమానత, ఆర్థిక అభద్రత వంటి సమస్యలు ప్రజలలో ఆగ్రహాన్ని పెంచుతున్నాయి.

Israel Hamas war: ఇస్మాయిల్ హనియే హత్య వెనక ఉన్న‌ మతిపోయే ప్లాన్!!

అతివాదుల చర్యలను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ ఆదేశించారు. నేరపూరిత చర్యలకు తగు మూల్యం తప్పదని హోం మంత్రి వివెట్‌ కూపర్‌ హెచ్చరించారు.  

Published date : 06 Aug 2024 09:50AM

Photo Stories