T20 World Cup India Team : టీ‍-20 వరల్డ్‌ కప్‌ 2022 టీమిండియా ఇదే.. వీరికి మరోసారి మొండిచెయ్యి..

ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల (అక్టోబర్‌) 16 నుంచి ప్రారంభంకానున్న టీ-20 వరల్డ్‌ కప్‌ కోసం భారత జట్టును సెలెక్టర్లు కొద్ది సేపటి కిందే ప్రకటించారు.

15 మంది సభ్యుల భారత బృందానికి రోహిత్‌ శర్మ నాయకుడిగా, కేఎల్‌ రాహుల్‌ ఉప నాయకుడిగా వ్యవహరించనున్నారు. ఆసియా కప్‌-2022లో పాల్గొన్న భారత జట్టునే సెలెక్టర్లు యధాతథంగా కొనసాగించారు. బుమ్రా, హర్షల్‌ పటేల్‌ తిరిగి జట్టులోకి వచ్చారు. 15 మంది సభ్యుల్లో ఉంటారనుకున్న మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌కు మరోసారి మొండిచెయ్యి ఎదురైంది. వీరిని స్టాండ్‌ బై సభ్యులుగా ఎంపిక చేశారు సెలెక్టర్లు.

Asia Cup T20 Cricket: శ్రీలంక ‘సిక్సర్‌’.. ఆరోసారి ఆసియా కప్‌ సొంతం

టీ‍-20 వరల్డ్‌ కప్‌ 2022 టీమిండియా ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్

స్టాండ్‌ బై సభ్యులు వీరే.. 
మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి భిష్ణోయ్, దీపక్ చాహార్‌

రానున్న ఐదేళ్లలో భారత పురుషుల క్రికెట్‌ జట్టు షెడ్యూల్‌ ఇదే..

రాబోయే ఐదేళ్ల కాలంలోనూ భారత పురుషుల క్రికెట్‌ జట్టు బిజీబిజీగా గడపనుంది.2023 నుంచి 2027 వరకు భవిష్యత్‌ పర్యటనల కార్యక్రమాన్ని (ఎఫ్‌టీపీ) అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆగస్టు 17వ తేదీన విడుదల చేసింది.
☛ ఐసీసీలో శాశ్వత సభ్యత్వం ఉన్న 12 దేశాలు రాబోయే ఐదేళ్లలో 173 టెస్టులు, 281 వన్డేలు, 323 టి20లతో కలిపి మొత్తం 777 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
☛ భారత జట్టు విషయానికొస్తే టీమిండియా 38 టెస్టులు, 42 వన్డేలు, 61 టి20 మ్యాచ్‌లతో కలిపి మొత్తం 141 మ్యాచ్‌ల్లో పోటీపడనుంది. అయితే ఈ ఐదేళ్లలో భారత్, పాకిస్తాన్‌ మధ్య ఒక్క ద్వైపాక్షిక సిరీస్‌ లేకపోవడం గమనార్హం. ఈ రెండు జట్లు ఐసీసీ టోర్నీలలోనే తలపడతాయి.
☛ ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌ జట్లతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లు ఆడుతుంది. ఆ్రస్టేలియాతో ఇప్పటివరకు నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ ఆడేది. 1991 తర్వాత మళ్లీ ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదు టెస్టుల సిరీస్‌కు సిద్ధమైంది.

T20 Highest Wicket Taker : 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా..

Download Current Affairs PDFs Here

 

Download Sakshi Education Mobile APP

#Tags