Indian Boxers: స్వర్ణ పతకాలు సాధించిన భారత బాక్సర్లు వీరే..

ఆసియా అండర్‌–22 బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఏడు స్వర్ణ పతకాలు సాధించారు.

మహిళల విభాగంలో ప్రీతి (54 కేజీలు), పూనమ్‌ పూనియా (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్‌ (75 కేజీలు)... విశ్వనాథ్‌ సురేశ్‌ (48 కేజీలు), నిఖిల్‌ (57 కేజీలు), ఆకాశ్‌ గోర్ఖా (60 కేజీలు) పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు.

ఫైనల్స్‌లో ప్రీతి 3–0తో బజరోవా ఎలీనా (కజకిస్తాన్‌)పై, పూనమ్‌ 4–1తో సకిష్‌ అనెల్‌ (కజకిస్తాన్‌)పై, ప్రాచి 4–1తో అనర్‌ తుసిన్‌బెక్‌ (కజకిస్తాన్‌)పై, ముస్కాన్‌ 3–2తో జకిరోవా అజీజియా (ఉజ్బెకిస్తాన్‌)పై గెలిచారు.

విశ్వనాథ్‌ సురేశ్‌ 5–0తో కరాప్‌ యెర్నర్‌ (కజకిస్తాన్‌)పై, సబీర్‌ యెర్బోలత్‌ (కజకిస్తాన్‌)పై నిఖిల్, ఆకాశ్‌ 4–1తో రుస్లాన్‌ (కజకిస్తాన్‌)పై విజయం సాధించారు. ఓవరాల్‌గా ఆసియా అండర్‌–22, యూత్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు 12 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలతో కలిపి మొత్తం 43 పతకాలు సంపాదించారు. 

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత పురుషుల-మహిళల రిలే జట్లు..

#Tags