CM Trophy: సీఎం ట్రోఫీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకున్న రుత్విక–రోహన్ జంట

సీఎం ట్రోఫీ ఇండియా ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి గద్దె రత్విక శివాని టైటిల్‌ను గెలిచింది.

ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లో జరిగిన ఈ టోర్నీలో రత్విక శివాని–రోహన్‌ కపూర్‌ జంట ఆదరగొట్టింది. టోర్నీలో మొత్తం ఐదు విభాగాల్లో (మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌) భారత ఆటగాళ్లే విజేతలు మరియు రన్నరప్‌గా నిలిచారు.

రత్విక శివాని, రోహన్ కపూర్ జంట ఫైనల్‌లో అమృత ప్రముథేశ్–అశిత్ సూర్య జంటను 21–16, 19–21, 21–12 స్కోరుతో ఓడించి టైటిల్‌ సాధించారు. 

ఇది కాకుండా.. రక్షిత శ్రీ సంతోష్‌ రామ్‌రాజ్ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆమె తన్వి పత్రిని 17–21, 21–12, 21–12తో ఓడించి గెలుపు సాధించింది. మొదటి గేమ్‌ను కోల్పోయిన రక్షిత, ఆ తర్వాత చక్కటి ఆటతో రెండు గేమ్‌లు గెలిచింది. ఇటీవ‌ల‌ హైదరాబాద్‌లో రన్నరప్‌గా నిలిచిన రక్షిత ఈసారి టైటిల్‌ సాధించడంతో పెద్ద విజయాన్ని అందుకుంది.

WTT Feeder Caracas 2024: భార్యతో కలిసి.. మిక్స్‌డ్‌ డబుల్స్ విజేతగా నిలిచిన భారత టీటీ స్టార్‌

పురుషుల సింగిల్స్ విభాగంలో మిథున్‌ మంజునాథ్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్‌లో 13–5తో ఆధిక్యంలో ఉన్న సమయంలో రాహుల్‌ భరద్వాజ్‌ గాయపడడంతో మిథున్‌ టైటిల్‌ను సాధించాడు.

పురుషుల డబుల్స్ విభాగంలో హరిహరణ్‌ అంసాకరుణన్‌–రూబన్‌ కుమార్ జంట 21–15, 21–16తో డింకూ సింగ్–అమాన్‌ మొహమ్మద్ జంటను ఓడించి టైటిల్‌ సాధించింది.

Seoul Open Tennis: సాకేత్‌–రామ్‌కుమార్‌ జోడీకి సియోల్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్

#Tags