French Open 2024: ఫ్రెంచ్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన స్పెయిన్‌ దిగ్గజం!!

మట్టికోర్టులపై మకుటంలేని మహరాజుగా వెలుగొందిన స్పెయిన్‌ దిగ్గజం రాఫెల్‌ నాదల్‌కు ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఊహించని పరాజయం ఎదురైంది.

2005 నుంచి ఈ టోర్నీలో ఆడుతూ ఏకంగా 14 సార్లు విజేతగా నిలిచిన 37 ఏళ్ల నాదల్‌ మొదటి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టడం ఇదే తొలిసారి. ప్రపంచ నాలుగో ర్యాంకర్, గత మూడేళ్లుగా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌ చేరిన జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ పక్కా ప్రణాళికతో ఆడి నాదల్‌ ఆట కట్టించాడు.

3 గంటల 5 నిమిషాలపాటు మే 27వ తేదీ జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో జ్వెరెవ్‌ 6–3, 7–6 (7/5), 6–3తో నాదల్‌ను ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు.   

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలిసారి ఆడుతున్న భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ పోరాటం మొదటి రౌండ్‌లోనే ముగిసింది. ప్రపంచ 18వ ర్యాంకర్‌ ఖచనోవ్‌ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో సుమిత్‌ 2–6, 0–6, 6–7 (5/7)తో ఓడిపోయాడు.  

IPL 2024: ఐపీఎల్‌-17 చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. రన్నరప్ సన్‌రైజర్స్‌కు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే..!

ఫ్రెంచ్‌ ఓపెన్‌ చరిత్రలో నాదల్‌ను ఓడించిన మూడో ప్లేయర్‌గా జ్వెరెవ్‌ నిలిచాడు. గతంలో సోడెర్లింగ్‌ (స్వీడన్‌; 2009లో ప్రిక్వార్టర్స్‌లో) ఒకసారి... జొకోవిచ్‌ (సెర్బియా; 2015 క్వార్టర్‌ ఫైనల్లో, 2021 సెమీఫైనల్లో) రెండుసార్లు ఈ టోర్నీ లో నాదల్‌ను ఓడించారు. 2016లో గాయం కారణంగా నాదల్‌ మూడో రౌండ్‌ నుంచి వైదొలిగాడు.

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో నాదల్‌ తొలి రౌండ్‌లో ఓడిపోవడం ఓవరాల్‌గా ఇది మూడోసారి మాత్రమే. ఇంతకుముందు నాదల్‌ 2016 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో, 2013 వింబుల్డన్‌ టోర్నీలో తొలి రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు.

#Tags