Nishant Dev: ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత బాక్సర్ ఈయ‌నే..

భారత బాక్సర్‌ నిశాంత్‌ దేవ్‌ పురుషుల 71 కేజీల విభాగంలో సెమీఫైనల్‌ చేరుకోవడం ద్వారా 2024 పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.

ఇది భారతదేశానికి ఈ విభాగంలో మొదటి ఒలింపిక్ కోటా. మే 31వ తేదీ జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో 5-0తో వాసిల్ సెబోటారి (మోల్డోవా)ను ఓడించి నిశాంత్ ఘన విజయం సాధించాడు.

మహిళల విభాగంలో అంకుశిత (60 కేజీలు), అరుంధతి (57 కేజీలు) క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయి ఒలింపిక్ అవకాశాలను కోల్పోయారు. అమిత్ పంఘాల్ (51 కేజీలు) ప్రిక్వార్టర్‌ఫైనల్‌లో గెలిచి, పారిస్‌కు అడుగు దూరంలో ఉన్నాడు.

ఈ విజయాలతో, భారతదేశం ఇప్పటివరకు పారిస్ ఒలింపిక్స్‌కు నాలుగు బెర్త్‌లను ఖాయం చేసుకుంది.

 

T20I Batsmen Rankings: టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. టాప్‌-5లో ఉన్న‌ది వీరే..

#Tags