2024 Miami Open: సినెర్‌ ఖాతాలో మయామి మాస్టర్స్‌ టైటిల్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్, ఇటలీ టెన్నిస్‌ స్టార్‌ యానిక్‌ సినెర్‌ మూడో ప్రయత్నంలో మయా­మి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫ్లోరిడాలో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సినెర్‌ 6–3, 6–1తో దిమిత్రోవ్‌ (బల్గేరియా)పై గెలిచాడు. 2021, 2023లలో రన్నరప్‌గా నిలిచిన సినెర్‌.. ఈసారి మాత్రం టైటిల్‌ను వదల్లేదు. సినెర్‌కు 11 లక్షల డాలర్ల (రూ.9 కోట్ల 16 లక్షలు) ప్రైజ్‌ మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ టైటిల్‌తో సినెర్‌ ఏటీపీ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ ప్లేయర్‌గా నిలిచాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌ క్రీడాకారిణి, ఈ ఏడాది ఆటకు వీడ్కోలు పలకనున్న అమెరికా టెన్నిస్‌ ప్లేయర్‌ డానియల్‌ కోలిన్స్‌ అ­ద్భుతం చేసింది. మయామి ఓపెన్‌ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. ఫ్లోరిడాలో జరిగిన మహిళల సింగిల్స్‌ఫైనల్లో 30 ఏళ్ల కోలిన్స్‌7–5, 6–3తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ రిబాకినా (కజకిస్తాన్‌)పై గెలిచింది. కోలిన్స్‌కు 11 లక్షల డాల­ర్ల (రూ. 9 కోట్ల 16 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌పాయింట్లు లభించాయి. మార్టినా నవ్రతిలోవా, క్రిస్‌ఎవర్ట్, వీనస్‌ విలియమ్స్, సెరెనా విలియమ్స్, స్లోన్‌స్టీఫెన్స్‌ తర్వా­త మయామి ఓపెన్‌ౖ టెటిల్‌ నెగ్గిన ఆరో అమెరికన్‌ ప్లేయర్‌­గా కోలిన్స్‌ గుర్తింపు పొందింది.

చదవండి: April 8th Current Affairs GK Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags