Chess Tournament: చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో హంపికి రెండో స్థానం
క్యాండిడేట్స్ టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి 7.5 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకోగా, వైశాలి 7.5 పాయింట్లతో నాలుగో స్థానాన్ని సంపాదించింది.
8 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 14 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో చైనా ప్లేయర్ టాన్ జోంగి 9 పాయింట్లతో విజేతగా నిలిచింది. మహిళల వరల్డ్ చాంపియన్ జు వెన్‌జున్ (చైనా)తో ప్రపంచ టైటిల్ కోసం టాన్ జోంగి తలపడుతుంది. చివరిదైన 14వ రౌండ్‌లో హంపి 62 ఎత్తుల్లో టింగ్‌జి లెపై.. వైశాలి 45 ఎత్తుల్లో కాటరీనా లాగ్నోపై గెలుపొందారు.
ఈ టోర్నీలో హంపి 3 గేముల్లో నెగ్గి, 9 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, 2 గేముల్లో ఓడిపోయింది. వైశాలి 6 గేముల్లో గెలిచి, 5 గేముల్లో ఓడిపోయి, 3 గేమ్‌లను ‘డ్రా’గా ముగించింది. హంపి, టింగ్‌జి లె, వైశాలి 7.5 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచినా మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు.
Gukesh: చరిత్ర సృష్టించిన గుకేశ్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..
#Tags