Jyoti Yarraji: జ్యోతి యర్రాజీకి స్వర్ణం

ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం గెలుచుకుంది.

మహిళల 60 మీటర్ల హర్డిల్స్‌ను 8.12 సెకన్లలో పూర్తి చేసి జ్యోతి మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో గత ఏడాది తానే నెలకొల్పిన 8.13 సెకన్ల జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది.
ఈ ఈవెంట్‌ హీట్స్‌ను 8.22 సెకన్లతో అగ్రస్థానంతో ముగించిన జ్యోతి ఫైనల్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అసుకా టెరెడా (జపాన్‌ – 8.21సె.), లుయి లై యు (హాంకాంగ్‌ – 8.21 సె.) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి భువనేశ్వర్‌లోని రిలయన్స్‌ ఫౌండేషన్‌ హై పెర్ఫార్మెన్స్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతోంది.  

ఈ చాంపియన్‌షిప్‌లో ఫిబ్ర‌వ‌రి 17వ తేదీ మరో రెండు స్వర్ణాలు భారత్‌ ఖాతాలో చేరాయి. పురుషుల షాట్‌పుట్‌లో తజీందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ పసిడి గెలుచుకున్నాడు. తన రెండో ప్రయత్నంలో అతను గుండును 19.71 మీటర్లు విసిరి అగ్ర స్థానం సాధించాడు. మహిళల 1500 మీటర్ల పరుగులో హర్‌మిలన్‌ బైన్స్‌ కనకం మోగించింది. రేస్‌ను హర్‌మిలన్‌ 4 నిమిషాల 29.55 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం గెలుచుకుంది.

Pan Zhanle: స్విమ్మింగ్‌ 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో ప్రపంచ రికార్డు

#Tags