Jyothi Yarraji: స్వర్ణ పతకంతో కొత్త సీజన్‌ను ప్రారంభించిన జ్యోతి యర్రాజీ!

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారత స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ ఘన విజయంతో కొత్త సీజన్‌ను ప్రారంభించింది.

మే 9వ తేదీ జరిగిన హ్యారీ షుల్టింగ్‌ గేమ్స్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఈ గేమ్స్ వరల్డ్‌ అథ్లెటిక్స్‌లో 'ఇ' కేటగిరీ కిందకి వస్తాయి.

విశాఖపట్నంకు చెందిన 24 ఏళ్ల జ్యోతి, 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును 12.87 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానం దక్కించుకుంది. ఇది ఆమె కెరీర్‌లో నాలుగో అత్యుత్తమ సమయం. నెదర్లాండ్స్‌కు చెందిన మిరా గ్రూట్ 13.67 సెకన్లతో రెండో స్థానంలో, మరో నెదర్లాండ్స్ క్రీడాకారిణి హనా వాన్ బాస్ట్ 13.84 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు.

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత పురుషుల-మహిళల రిలే జట్లు..

జ్యోతి ఇంకా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు. ఎందుకంటే ఆమె 12.77 సెకన్ల అర్హత సమయాన్ని అందుకోలేదు. అయితే ర్యాంకింగ్స్ ఆధారంగా ఆమెకు ఓలింపిక్ బెర్త్ ఖరారు కావచ్చు. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో జ్యోతి 26వ స్థానంలో ఉంది. మొత్తం 40 మంది ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. వీరిలో 25 మంది అర్హత సమయం ఆధారంగా, మరో 15 మంది వరల్డ్‌ ర్యాంకింగ్‌ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

#Tags