T20 Series: టీ20ల్లో అత్యధిక స్కోర్ నమోదు చేసుకున్న భారత మహిళల జట్టు
భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు ప్రదర్శనతో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది.
డిసెంబర్ 19వ తేది ముందుగా బ్యాటింగ్‌లో, ఆపై బౌలింగ్‌లో చెలరేగిన భారత్ 60 పరుగుల తేడాతో విండీస్ మహిళల జట్టుపై ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో గెలుచుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 22వ తేది వడోదరలో తొలి వన్డే జరుగుతుంది.
- అంతర్జాతీయ టీ20ల్లో భారత మహిళల జట్టుకు అత్యధిక స్కోరు 217/4 ఇదే. ఇదే ఏడాది యూఏఈపై సాధించిన 201/5 స్కోరును భారత్ అధిగమించింది.
- హాఫ్ సెంచరీకి రిచా తీసుకున్న బంతులు 18. సోఫీ డివైన్, లిచ్‌ఫీల్డ్ పేరిట వేగవంతమైన అర్ధసెంచరీ రికార్డును రిచా సమం చేసింది.
- స్మృతి మంధాన అర్ధ సెంచరీల సంఖ్య 30. సుజీ బేట్స్ (29)ను అధిగమించి అగ్ర స్థానానికి చేరింది.
- ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో స్మృతి చేసిన పరుగులు 763. క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చమరి అటపట్టు (720) రికార్డును స్మృతి సవరించింది.
Junior Hockey Asia Cup: వరుసగా రెండోసారి.. జూనియర్ హాకీ ఆసియా కప్ భారత్‌దే..
#Tags