ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. టాప్‌–10లో ఉన్న ఇండియ‌న్ ప్లేయ‌ర్స్‌ వీరే..

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.

టాప్‌–10లో భారత్‌ నుంచి ముగ్గురు స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక స్థానం పడిపోయి 751 రేటింగ్‌ పాయింట్లతో ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్‌ ఒక స్థానం మెరుగుపర్చుకొని 740 రేటింగ్‌ పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. విరాట్‌ కోహ్లి రెండు స్థానాలు పురోగతి సాధించి 737 రేటింగ్‌ పాయింట్లతో ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు.  పాకిస్తాన్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ ఆరు స్థానాలు పడిపోయి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. 

ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న‌ది వీరే..
1. జో రూట్ (ఇంగ్లాండ్ స్టార్‌ బ్యాటర్‌) – 881 రేటింగ్ పాయింట్లు
2. కేన్ విలియ‌మ్స‌న్ (న్యూజిలాండ్‌) – 859 రేటింగ్ పాయింట్లు
3. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్‌) – 768 రేటింగ్ పాయింట్లు
4. హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్‌) – 758 రేటింగ్ పాయింట్లు
5. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 757 రేటింగ్ పాయింట్లు
6. రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 751 రేటింగ్ పాయింట్లు

T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల.. భారత జట్టు.. మ్యాచ్‌లు ఇవే..

టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో.. భారత స్పిన్నర్ అశ్వీన్‌ 870 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 847 పాయింట్లతో హాజల్‌వుడ్‌ (ఆ్రస్టేలియా), బుమ్రా (భారత్‌) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. 

#Tags