Paris Olympics: ఒలింపిక్స్‌ విజేతలకు నగదు బహుమతులు.. ఎవరికి ఎంత ఇస్తున్నారో తెలుసా..?

ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టిన అథ్లెట్లను ఆయా ప్రభుత్వాలు నగదు బహుమతులు ప్రకటించి సత్కరించాయి.

పారిస్‌ ఒలింపిక్స్‌లో భార‌తదేశం 6 ప‌త‌కాలను సాధించింది. ఇందులో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకాలున్నాయి. 

మనూ భాకర్..
✦ స్టార్‌ షూటర్‌ మనూ భాకర్ ఒకే ఒలింపిక్స్ ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. 
✦ ఈమె 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో కాంస్య పతకం గెలుపొంది భారత్‌కు తొలి పతకాన్ని అందించింది.  
✦ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి మరో కాంస్య పతకాన్ని సాధించింది.

✦ మనూ భాకర్‌కు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రూ.30 లక్షల రివార్డును ప్రకటించారు. ఈమె ఒలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో భారత్‌ తరఫున పతకధారిగా వ్యవహరించారు.

సరబ్‌జోత్‌ సింగ్‌..
✦ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్‌ సింగ్‌, మనుబాకర్‌తో కలిసి కాంస్య పతకం అందుకున్నాడు.
✦ ఈయ‌న‌కు కేంద్ర క్రీడల శాఖ మంత్రి రూ.22.5 లక్షల రివార్డును ప్రకటించారు.
✦ అలాగే.. హరియాణా ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తామని ప్రకటన చేసింది. తన దృష్టంతా షూటింగ్‌పైనే ఉండంతో ఆ జాబ్ ఆఫర్‌ను సరబ్‌జోత్ తిరస్కరించారు.

Paris Olympics: ముగిసిన ఒలింపిక్స్.. ఎక్కువ‌ పతకాలు సాధించిన దేశాలివే! 2028 ఒలింపిక్స్ ఎక్క‌డంటే..

స్వప్నిల్ కుసాలే..
✦ పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకం గెలిచాడు. ఈ ఈవెంట్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా ఈయ‌న చరిత్ర సృష్టించాడు.  
✦ మహారాష్ట్ర ప్రభుత్వం స్వప్నిల్‌కు రూ.కోటి నజరానా ప్రకటించింది. 
సెంట్రల్‌ రైల్వేలో ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ట్రావెలింగ్‌ టికెట్‌ ఎగ్జామినర్‌ (టీటీఈ)గా పనిచేస్తున్న కుసాలేను ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్‌డీ)గా నియమిస్తూ ప్రమోషన్‌ ఆర్డర్‌ను జారీ చేసినట్లు సెంట్రల్‌ రైల్వే తెలిపింది. 

పురుషుల హాకీ జట్టు..
✦ భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని సాధించింది. 
✦ జట్టులోని ఒక్కో సభ్యుడికి రూ.15 లక్షలు, సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.7.5 లక్షల నగదు బహుమతిని హాకీ ఇండియా ప్రకటించింది.
✦ డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌కు ఒడిశా ప్రభుత్వం రూ.4 కోట్ల నజరానా.. ఒక్కోక్క‌రికి రూ.15 లక్షలు, సపోర్ట్‌ స్టాఫ్‌కు రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. 
✦ అలాగే.. పంజాబ్ సీఎం భగవంత్ మన్ హాకీ జట్టుకు రూ.కోటి నగదు బహుమతి ప్రకటించారు.  

నీరజ్‌ చోప్రా..
✦ పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లో భారత స్టార్ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్ చోప్రా రజత(సిల్వర్) పతకం సాధించాడు. 
✦ నీరజ్‌కు అందించే రివార్డులపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటనలు లేవు. కానీ.. పలు సంస్థలు భారీగా రివార్డులు, అవార్డులు అందజేయనున్నట్లు సమాచారం. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించినప్పుడు హరియాణా ప్రభుత్వం ఈయ‌న‌కు రూ.6 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది.

అమన్‌ సెహ్రావత్‌..
భారత యువ రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ విభాగంలో పతకం గెలిచిన ఒకే ఒక్కడు అమన్‌. ఈయ‌న‌కు నగదు బహుమతులపై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 

Olympic Medal Winners: ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశం ఇదే!

#Tags