Asian Gymnastics: ఏషియన్‌ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి పసిడి

భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ కొత్త చరిత్ర లిఖించింది. డోపింగ్‌ ఆరోపణలతో 21 నెలల పాటు సస్పెన్షన్‌ ఎదుర్కొన్న దీప.. అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. ఏషియన్‌ సీనియర్‌ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో దీప పసిడి పతకంతో మెరిసింది. ఈ టోర్నీలో స్వర్ణం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీప అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ సీనియర్‌ జిమ్నాస్ట్‌ 13.566 పాయింట్లు సాధించి అగ్ర‌స్థానంలో నిలిచింది. కిమ్‌సాన్‌ హ్యాంగ్‌(13.466), జో క్యాంగ్‌ బోల్‌(12.966) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.

Paris Olympics: పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత బాక్సర్లు వీరే..

#Tags