Pan Zhanle: స్విమ్మింగ్‌ 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో ప్రపంచ రికార్డు

ప్రపంచ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది.

దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 4*100 మీటర్ల రిలే ఫైనల్లో చైనా స్విమ్మర్‌ పాన్‌ జాన్లె తన అంచెను 46.80 సెకన్లలో పూర్తి చేశాడు.

ఈ క్రమంలో డేవిడ్‌ పోపోవిచి (రొమేనియా; 46.86 సెకన్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పాన్‌ జాన్లె బద్దలు కొట్టాడు. చైనా బృందం రిలే రేసును 3ని:11.08 సెకన్లలో ముగించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటలీ జట్టుకు రజతం, అమెరికా జట్టుకు కాంస్య పతకం లభించాయి.

Akshdeep Singh: 20 కిలోమీటర్ల నడకలో అక్ష్‌దీప్‌ జాతీయ రికార్డు..

#Tags