Deodhar Trophy 2023: దేవధర్‌ ట్రోఫీ టైటిల్‌ విజేతగా సౌత్‌జోన్‌

దేశవాళీ జోనల్‌ వన్డే క్రికెట్‌ టోర్నీలో మయాంక్‌ అగర్వాల్‌ సారథ్యంలోని సౌత్‌జోన్‌ జట్టు అజేయ విజేతగా నిలిచింది.
Deodhar Trophy 2023

పుదుచ్చేరిలో గురువారం జరిగిన ఫైనల్లో సౌత్‌జోన్‌ 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌ జట్టును ఓడించి తొమ్మిదోసారి దేవధర్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది.

☛☛ Ravindra Jadeja breaks Kapil Dev Record: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌత్‌జోన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. రోహన్‌ (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. మయాంక్‌ (63; 4 ఫోర్లు), జగదీశన్‌ (54; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్‌జోన్‌ 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది.
రియాన్‌ పరాగ్‌ (95; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించినా మిగతావాళ్లు రాణించడంలో విఫలమయ్యారు. సౌత్‌జోన్‌ బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ మూడు వికెట్లు తీయగా... వైశాఖ్, కౌశిక్, విద్వత్‌ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.  టోర్నీలో 354 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసిన రియాన్‌ పరాగ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

☛☛ India create World record in Test history: చరిత్ర సృష్టించిన టీమిండియా

#Tags