WPL Auction 2023: ‘అమ్మ’ నుంచి మళ్లీ ఆటకు.. స్నేహ దీప్తికి డబ్ల్యూపీఎల్‌ అవకాశం

16 ఏళ్ల 204 రోజులు.. 2013 ఏప్రిల్‌లో స్నేహ దీప్తి అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ టి20ల్లో ఆడిన భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందింది.

ఆ తర్వాత మరో టి20 మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఆమె అదే నెలలో తన ఏకైక వన్డే కూడా ఆడింది. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు ఆమె దూరమైంది. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత స్నేహ దీప్తికి అరుదైన రీతిలో తొలి డబ్ల్యూపీఎల్‌లో ఆడే అవకాశం దక్కింది. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆమెను రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. సాధారణంగా దశాబ్ద కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం అంటే కెరీర్‌ ముగిసినట్లే. కానీ దీప్తి 26 ఏళ్ల వయసులో మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇన్నేళ్ల పాటు ఆటకు దూరం కాకుండా ‘అమ్మ’గా మారిన తర్వాత కూడా క్రికెట్‌లో ఆమె కొనసాగిన తీరు స్ఫూర్తిదాయకం. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (22-28 జనవరి 2023)

దూకుడైన బ్యాటింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న స్నేహ ఆంధ్ర జట్టు తరఫున నిలకడైన ప్రదర్శనతో చిన్న వయసులోనే భారత జట్టులో అవకాశం దక్కించుకుంది. దేశవాళీలో దక్షిణ మధ్య రైల్వే తరఫున చక్కటి ఇన్నింగ్స్‌లతో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఫిబ్రవరి 2021లో ఆమెకు పాప పుట్టింది. ఈ సమయంలోనే ఆటకు విరామమిచ్చి స్నేహ సెపె్టంబర్‌లోనే మళ్లీ దేశవాళీ క్రికెట్‌లోకి అడుగు పెట్టింది. అప్పటి నుంచి క్రికెట్‌ను కొనసాగిస్తూ ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌తో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (22-28 జనవరి 2023)

#Tags