Thomas and Uber Cup: ‘డబుల్‌’ ధమాకా.. థామస్‌, ఉబెర్‌ కప్‌ టైటిల్స్‌ సొంతం చేసుకున్న జ‌ట్లు ఇవే..

ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తమకు తిరుగులేదని చైనా జట్లు మరోసారి చాటుకున్నాయి.

థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ టీమ్‌ టోర్నమెంట్‌లో విజేతగా అవతరించాయి. 
 
ఉబెర్‌ కప్‌:
➤ సొంతగడ్డపై జరిగిన ఈ టోర్నీలో చైనా మహిళల జట్టు ఇండోనేసియాను 3-0తో ఓడించి 16వ సారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
➤ చెన్‌ యు ఫె, చెన్‌ కింగ్‌ చెన్‌–జియా యి ఫాన్‌, హి బింగ్‌ జియావో చైనాకు విజయం తెచ్చిపెట్టారు.

థామస్‌ కప్‌:
➤ పురుషుల టోర్నీలో చైనా ఇండోనేసియాను 3-1తో ఓడించి 11వ సారి థామస్‌ కప్‌ను సొంతం చేసుకుంది.
➤ షి యు కి, లియాంగ్‌ –వాంగ్‌ చాంగ్‌, హి జి టింగ్‌–జియాంగ్‌ చైనాకు విజయం తెచ్చిపెట్టారు.

Archery World Cup: ప్రపంచకప్ టోర్నీలో సత్తా చాటిన భారత ఆర్చరీ జట్టు!

#Tags