Strong Solar Storm: భూమిని తాకిన చాలా బలమైన సౌర తుఫాను!!

భారీ సౌర తుఫాను భూమిని తాకి, గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా భూమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణాన్ని ప్రభావితం చేసింది.

ఈ తుఫాను ఫలితంగా భారత్‌లోని లద్దాఖ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో దేదీప్యమాన అరోరాలు కనిపించాయి. ఈ తుఫాను కారణంగా కొన్ని ప్రాంతాలలో విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్, ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థలకు కూడా స్వల్ప అంతరాయం ఏర్పడింది. అయితే.. పెద్ద ఇబ్బందులు ఏమీ కలగలేదు.

అమెరికా నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ప్రకారం ఈ తుఫాను మే 12వ తేదీ కూడా కొనసాగుతుందని పేర్కొంది. ఈ తాజా సౌర తుఫానుకు కారణం సౌరగోళంలోని ఏఆర్ 13664 అనే ప్రాంతంలో ఏర్పడిన ఒక భారీ సౌర మచ్చ. ఈ తుఫాను వల్ల అమెరికాతో సహా ఉత్తరార్ధగోళంలోని ఆస్ట్రియా, జర్మనీ, స్లొవేకియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, పోలాండ్ యొక్క ఎగువ ప్రాంతాలలో అరోరాలు కనిపించాయి. భారతదేశంలోని లద్దాఖ్ లోని హాన్లే డార్క్ స్కై రిజర్వు ప్రాంతంలో కూడా ఈ అరోరాలు కనిపించాయి. ఆకాశం అరుణ వర్ణపు కాంతితో నిండిపోయింది.

Sunita Williams: రోదసీ యాత్ర‌కు సిద్ధ‌మైన‌ సునీతా విలియమ్స్.. ఆగిన యాత్రకు కొత్త తేదీ ఖరారు..

#Tags