Chandrayaan-3 Mision: భూ కక్ష్యకు ప్రొపల్షన్ మాడ్యుల్‌

చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్ మాడ్యుల్‌ను చంద్రుని కక్ష్య నుంచి భూ కక్ష్య వరకు మళ్లించినట్లు ఇస్రో తెలిపింది.
propulsion module moves from lunar orbit to earth orbit

చంద్రుడి కక్ష్యలోకి పరికరాలను పంపిన ఇస్రో.. ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకురావడంపై దృష్టిపెట్టింది.  కక్ష్య పొడిగింపు, ట్రాన్స్‌ ఎర్త్‌ ఇంజెక్షన్‌ విన్యాసాలతో దీనిని పూర్తిచేసినట్లు ఇస్రో వెల్లడించింది.

ISRO's AstroSat: అంతరిక్షంలో గామా కిరణ పేలుడును గుర్తించిన ఇస్రో ఆస్ట్రోశాట్‌

చంద్రయాన్‌-3లోని మూడు ప్రధాన భాగాల‌లో ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ కూడా ఒకటి. ఇది కాకుండా ల్యాండర్‌ మాడ్యుల్‌, రోవర్‌ ఉన్నాయి. ఇక ప్రొపల్షన్‌ మాడ్యుల్‌తో ల్యాండర్‌ మాడ్యుల్‌ అనుసంధానమై ఉంటుంది. ఇది వాహకనౌక నుంచి విడిపోయి, ల్యాండర్‌ మాడ్యుల్‌ను చంద్రుడికి 100 కి.మీ. సమీపం వరకు తీసుకెళ్లింది. ఆ తర్వాత ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యుల్‌ విడిపోయింది. ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ కొన్ని నెలల పాటు కక్ష్యలోనే ఉంది. దీనిలోని పరికరం సాయంతో సమాచారాన్ని సేకరించి శాస్త్రవేత్తలకు పంపింది.

Aditya-L1 Mission: సౌర గాలులను ఆధ్యయనం చేస్తున్న ఆదిత్య ఎల్‌–1

#Tags