IIT-Guwahati: ఐఐటీ-గౌహతి నుంచి బయోమెడ్‌కు కొత్త టీకా టెక్నాలజీ
భారతదేశ ప్రముఖ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-గౌహతి (IIT-G) టీకా తయారీలో ప్రముఖ సంస్థ అయిన బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఒక విప్లవాత్మక టీకా టెక్నాలజీని బదిలీ చేసింది.
పందులు, అడవి పందులలో క్లాసికల్ స్వైన్ ఫీవర్ వైరస్ (classical swine fever virus)ను నిరోధించడానికి ప్రత్యేకంగా రూపొందించిన రీకాంబినెంట్ వెక్టర్ (recombinant vector) టీకా టెక్నాలజీ ఇది. ఈ టెక్నాలజీ భారతదేశ టీకా రంగంలో ఒక గుర్తింపుని తెస్తుంది.
రివర్స్ జెనెటిక్ ప్లాట్‌ఫాం
మార్చి 26వ తేదీ IIT-G విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ టీకా టెక్నాలజీ IIT-Gలోనే అభివృద్ధి చేయబడిన, మెరుగుపరచబడిన "రివర్స్ జెనెటిక్ ప్లాట్‌ఫాం"ను ఉపయోగించుకుంటుంది. క్లాసికల్ స్వైన్ ఫీవర్ వైరస్ అనేది పందులలో వ్యాపించే అత్యంత సంక్రమణ కారక వ్యాధి. మానవులకు సోకదు కానీ, పందుల మరణాల శాతం చాలా ఎక్కువగా ఉండటం వల్ల తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది.
Reusable Launch Vehicle: తగ్గేదేలే.. 'పుష్పక్' రాకెట్ ల్యాండింగ్ ప్రయోగం విజయవంతం
#Tags