Earth Mars Transfer Window: అందుబాటులోకి వస్తున్న‌ మార్స్‌ ట్రాన్స్‌ఫర్‌ విండో! ఏమిటీ ట్రాన్స్‌ఫర్‌ విండో?

సైంటిస్టులంతా రెండేళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎర్త్‌–మార్స్‌ ట్రాన్స్‌ఫర్‌ విండో’ అక్టోబర్‌లో అందుబాటులోకి రానుంది.

2022 నాటి ట్రాన్స్‌ఫర్‌ విండో సందర్భంగా నాసా వంటి అంతరిక్ష సంస్థలు పలు అంగారక ప్రయోగాలు చేశాయి. భావి మార్స్‌ మిషన్లకు అవసరమైన సామగ్రిని అంగారకునిపైకి ముందే చేరేసేందుకు ప్రయత్నించాయి. మరో నెల రోజుల అంతరం అక్టోబర్‌ ‘విండో’లో కూడా అలాంటి ప్రయోగాలు చేపట్టే దిశగా యోచిస్తున్నాయి. 

ఏమిటీ ట్రాన్స్‌ఫర్‌ విండో? 
ఇది భూ, అంగారక గ్రహాలు రెండూ పరస్పరం అత్యంత సమీపానికి వచ్చే సమయమని చెప్పవచ్చు. కనుక సహజంగానే ఆ సందర్భంగా భూమికి, అంగారకునికి మధ్య దూరం అత్యంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అతి తక్కువ ఇంధన వ్యయంతో అంగారక ప్రయోగాలు సాధ్యపడుతాయి. ఫలితంగా ప్రయోగ ఖర్చుతో పాటు అరుణ గ్రహాన్ని చేరేందుకు పట్టే సమయమూ తగ్గుతుంది. కేవలం 6 నుంచి 8 నెలల్లో అంగారకున్ని చేరవచ్చు. అదే ఇతర సమయాల్లో అయితే ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. 

Polaris Dawn: స్పేస్‌ఎక్స్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం.. అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన స్పేస్‌వాకర్లు

వీటన్నింటికీ మించి ట్రాన్స్‌ఫర్‌ విండోలో ప్రయోగించే అంతరిక్ష నౌక అంగారకుడు అత్యంత అనువైన పొజిషన్‌లో ఉండగా దాని కక్ష్యలోకి ప్రవేశించగలుగుతుంది. కనుక ప్రయోగం విజయవంతమయ్యే అవకాశం ఎన్నో రెట్లు పెరుగుతుంది. భూమి, అంగారకుల మధ్య ఈ విండో దాదాపు 26 నెలలకు ఓసారి పునరావృతమవుతూ ఉంటుంది. హాన్‌మన్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ సూత్రం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. ఈ విండో సమయాన్ని కచ్చితంగా లెక్కించడం అంతరిక్ష సంస్థలకు చాలా కీలకం. లేదంటే ప్రయోగం రెండేళ్లు ఆలస్యమయ్యే ప్రమాదముంటుంది. 

2026 విండోపై స్పేస్‌ ఎక్స్‌ కన్ను ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌ తన అంగారక యాత్ర సన్నాహాలకు మరింత పదును పెడుతోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే 2026లో అంగారకునిపైకి మానవరహిత ‘స్టార్‌షిప్‌’ మిషన్‌ చేపట్టనున్నట్టు సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ఆ ఏడాది ‘ఎర్త్‌–మార్స్‌ ట్రాన్స్‌ఫర్‌ విండో’ సందర్భంగా ప్రయోగం ఉంటుందని వెల్లడించారు.

అంతరిక్ష నౌక సజావుగా అరుణ గ్రహంపై దిగి తమ మిషన్‌ విజయవంతమైతే మరో రెండేళ్లలో, అంటే 2028 నాటికి మానవసహిత అంగారక యాత్ర ఉంటుందని చెప్పారు. నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు కూడా 20206 విండో సందర్భంగా అంగారకునిపైకి మరింత అదనపు సామగ్రి తదితరాలను చేరవేసేందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తున్నాయి.

NASA: మానవులు సృష్టించిన మొట్టమొదటి ఉల్కాపాతం.. భూమిపైకి చేరుకునే అవకాశం

#Tags