Spacewalk: స్పేస్‌ వాక్‌.. ఐఎస్‌ఎస్‌కు సోలార్‌ ప్యానళ్ల బిగింపు

వయో భారంతో సతమతమవుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) సామర్థ్యం పెంచేందుకు నాసా ఫ్లైట్‌ ఇంజనీర్లు జోష్‌ కసాడా, ఫ్రాంక్‌ రుబియో నడుం బిగించారు.

ఏడు గంటలపాటు శ్రమించి దానికి కొత్త సోలార్‌ ప్యానళ్లు బిగించారు. ఇందుకోసం అంతరిక్షంలో నడిచారు. వీరికిది మూడో స్పేస్‌ వాక్‌. కొత్త ప్యానళ్లు ఐఎస్‌ఎస్‌ విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని 30 శాతం దాకా పెంచనున్నాయి. ఐఎస్‌ఎస్‌కు మరమ్మతులు కోసం శాస్త్రవేత్తలు, సిబ్బంది స్పేస్‌ వాక్‌ చేయడం ఇది 257వ సారట! ఆర్నెల్ల మిషన్లో భాగంగా వాళ్లు ఐఎస్‌ఎస్‌లో గడుపుతున్నారు. 

Cosmic Violence: అరుదైన అంతరిక్ష దృగ్విషయం.. అంత్య దశలో ఉన్న నక్షత్రాన్ని..

#Tags